Telugu Global
NEWS

చంద్రబాబు ఫొటోకు మంత్రి నో... జై జనసేన....

అన్ని పరిణామాలు…. భూమా అఖిలప్రియ టీడీపీకి దూరమవుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ టికెట్‌ను భూమా కుటుంబం నుంచి లాగేసుకునేందుకు టీడీపీలోకి కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. ఫరూక్ మంత్రి అయ్యాక ఏకంగా మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లపైనే పోలీసులు రైడ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఫరూక్‌ భూమా వర్గాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆళ్లగడ్డలో భూమానాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వచ్చిన సుబ్బారెడ్డి కూడా […]

చంద్రబాబు ఫొటోకు మంత్రి నో... జై జనసేన....
X

అన్ని పరిణామాలు…. భూమా అఖిలప్రియ టీడీపీకి దూరమవుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ టికెట్‌ను భూమా కుటుంబం నుంచి లాగేసుకునేందుకు టీడీపీలోకి కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఫరూక్ మంత్రి అయ్యాక ఏకంగా మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లపైనే పోలీసులు రైడ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఫరూక్‌ భూమా వర్గాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

అదే సమయంలో ఆళ్లగడ్డలో భూమానాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వచ్చిన సుబ్బారెడ్డి కూడా అఖిలప్రియ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. ఇలా మంత్రిగా ఉన్నప్పటికీ తన అనుచరుల ఇళ్లపైనే పోలీసులు దాడులు చేయడంతో అఖిలప్రియ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. వారం రోజులుగా ఆమె గన్‌మెన్లు లేకుండానే తిరుగుతున్నారు.

సోదరికి అండగా భూమా బ్రహ్మానందరెడ్డి కూడా గన్‌మెన్లను వెనక్కు పంపించారు. అయినా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈనేపథ్యంలో భూమా అఖిలప్రియ వర్గం మరో అడుగు ముందుకేసింది. ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటోను వాడడం లేదు.

అఖిలప్రియ ఆదేశాల మేరకే ఆమె అనుచరులు ఇలా చంద్రబాబు ఫొటో లేకుండా ఫ్లెక్సీలు కడుతున్నట్టు సమాచారం. అఖిలప్రియ కూడా కొద్దిరోజులుగా టీడీపీ కండువా లేకుండా పర్యటనలు చేస్తున్నారు.

టీడీపీలో వర్గపోరు భరించలేకపోతున్న అఖిలప్రియ… త్వరలోనే జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని… అందుకే ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటో, మెడలో టీడీపీ కండువా లేకుండా ఆమె ముందుకెళ్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపారని అనుచరులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు జనసేనలో చేరేలా ముఖ్యనాయకులతో ఆమె చర్చలు జరుపుతున్నారు.

First Published:  10 Jan 2019 11:08 PM GMT
Next Story