వెంకీ తో నటించే అవకాశం వదులుకున్న

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న సినిమా “ఎఫ్ 2”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని బయట పెట్టాడు వరుణ్ తేజ్. ఆ విషయం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ “ఎఫ్ 2 కంటే ముందే వెంకటేష్ గారితో నటించే అవకాశం నాకు వచ్చింది. “ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు” అనే సినిమాలో వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ కోసం నన్నే అడిగారు, కానీ అప్పుడు మరి చిన్నవాడిని అయిపోవడం వల్ల ఆ సినిమా చెయ్యలేదు.

ఇక ఆ తరువాత “వాసు” సినిమాలో వెంకటేష్ తమ్ముడి క్యారెక్టర్ కోసం అడిగారు. ఇక అప్పుడు స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. ఇదిగో ఇలా హీరో అయ్యాక వెంకటేష్ గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది” అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. మొత్తానికి రెండు సార్లు నటించే అవకాశాన్ని వదులుకొని  ఇన్నాళ్ళకి మళ్ళి ఆ అవకశాన్ని దక్కించుకొని చాలా హ్యాపి ఫీల్ అవుతున్నాడు వరుణ్ తేజ్.