హీరోయిన్ ని రీప్లేస్ చేసిన విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గత రెండేళ్ళ నుంచి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. గత ఏడాది “గీత గోవిందం” “నోటా” “టాక్సీ వాలా” సినిమాలు రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” సినిమాలో నటిస్తున్నాడు. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్ రామారావు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు.

మొదట ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ గా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ మరియు ఫారిన్ నటి ఇజాబెల్లె ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్స్ ని ఒక హీరోయిన్ ని మూవీ యూనిట్ తీసేస్తున్నారు అని టాక్. ఇక ఈమె ప్లేస్ లో బన్నీ సరసన “ఇద్దరమ్మయిలతో” “సరైనోడు” సినిమాల్లో హీరోయిన్ గా నటించిన క్యాథరిన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసాడు అంట విజయ్ దేవరకొండ. మరి ఇండస్ట్రీ లో అస్సలు క్రేజ్ లేని క్యాథరిన్ ని ఈ సినిమా కోసం ఎందుకు తీసుకున్నారు అనే మూవీ యూనిట్ కే తెలియాలి. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.