కోహ్లి బ్రాండ్ బాజా…. వెనుకబడ్డ షారుక్‌

భారత్ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లి శకం క్రికెట్‌లోనే కాదు బ్రాండ్‌లోనూ నడుస్తోంది. 2018 మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ప్రముఖ గ్లోబల్‌ వాల్యుయేషన్, కార్పొరేట్‌ ఫైనాన్స్ అడ్వయిజర్‌ డఫ్‌ అండ్ ఫెల్ఫస్‌ నివేదిక ప్రకారం కోహ్లి కోసం కార్పొరేట్ సంస్థలు ఎగబడుతున్నాయి.

2018లో బ్రాండ్‌ విలువ 18 శాతం పెరిగి ఏకంగా రూ. 1,200 కోట్లకు చేరింది. కోహ్లి తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్ దీపికాపడుకోన్ ఉన్నారు. ఆమె బ్రాండ్ విలువ 2018లో 718 ( 102.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) కోట్లుగా ఉంది.

మూడు, నాలుగు స్థానాల్లో హీరోలు అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్ సింగ్ ఉన్నారు. వీరి బ్రాండ్ విలువ వరుసగా 473 కోట్లు(67. 3 మిలియన్ డాలర్లు), 443 కోట్లు(63 మిలియన్ డాలర్లు)గా ఉంది.

షారుక్‌ఖాన్ బ్రాండ్ విలువ మాత్రం పడిపోయింది. గతంలో రెండో స్థానంలో ఉన్న షారుక్‌ ఖాన్ 2018లో ఐదో స్థానానికి పడిపోయాడు. అతడి బ్రాండ్ విలువ 60.7 మిలియన్ డాలర్లుగా ఉంది. టాఫ్‌ 20 బ్రాండ్ అంబాసిడర్లలో బాలీవుడ్ సెలబ్రిటీలదే పైచేయిగా ఉంది. వారికి క్రీడారంగానికి చెందిన వారు గట్టి పోటీ ఇస్తున్నారు.