Telugu Global
NEWS

యువ క్రికెటర్లకు విరాట్ కొహ్లీ సవాల్

పాండా, రాహుల్ వివాదంపై పెదవి విప్పిన టీమిండియా కెప్టెన్ మహిళలపై యువక్రికెటర్ల వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్న కొహ్లీ ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ సవాల్ కు తాము సిద్ధమని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించాడు. తొలి వన్డే వేదిక సిడ్నీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కొహ్లీ పాల్గొని వివిధ అంశాలపై.. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకొన్నాడు. యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వివాదం పై…కెప్టెన్ విరాట్ కొహ్లీ తొలిసారిగా పెదవి విప్పాడు. ఈ వివాదం ఆ […]

యువ క్రికెటర్లకు విరాట్ కొహ్లీ సవాల్
X
  • పాండా, రాహుల్ వివాదంపై పెదవి విప్పిన టీమిండియా కెప్టెన్
  • మహిళలపై యువక్రికెటర్ల వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్న కొహ్లీ

ఆస్ట్రేలియాతో తీన్మార్ వన్డే సిరీస్ సవాల్ కు తాము సిద్ధమని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించాడు. తొలి వన్డే వేదిక సిడ్నీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కొహ్లీ పాల్గొని వివిధ అంశాలపై.. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకొన్నాడు.

యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వివాదం పై…కెప్టెన్ విరాట్ కొహ్లీ తొలిసారిగా పెదవి విప్పాడు. ఈ వివాదం ఆ ఇద్దరి ఆటగాళ్ల వ్యక్తిగతమని…. జట్టుకు ఏవిధమైన సంబంధం లేదని…. తేల్చి చెప్పాడు.

యువక్రికెటర్ల అనుచిత వ్యాఖ్యలను సమర్థించే ప్రసక్తే లేదని వివరించాడు. హార్ధిక్ పాండ్యా, రాహుల్ లపై రెండుమ్యాచ్ ల నిషేధం సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని…తమ జట్టు ఆటతీరుపై ఈ వివాదం ప్రభావం పడే ప్రసక్తే లేదని తెలిపాడు.

ఒకవేళ…సస్పెన్ష్ తో హార్థిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే…స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తుదిజట్టులో చోటు కల్పిస్తామని చెప్పాడు.

ప్రపంచకప్ కోసం సన్నాహకంగా ఆడుతున్న ప్రస్తుత వన్డే సిరీస్ తో పాటు.. వచ్చే మూడు మాసాలలో ఆడే మ్యాచ్ లన్నీ…తమ జట్టు సభ్యులతో పాటు…యువ ఆటగాళ్లకు నిజమైన సవాలని తెలిపాడు.

బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి…సిరాజ్ కు చోటు కల్పించామని…సిరాజ్ సైతం తన సత్తా ఏపాటిదో చాటుకోవాల్సి ఉందని అన్నాడు. ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు కోసం పోటీపడే అవకాశాలను.. యువక్రికెటర్లకు కల్పించడం కూడా తమజట్టు వ్యూహంలో భాగమని వివరించాడు.

అంతకు ముందు.. కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తో కలసి…తీన్మార్ వన్డే సిరీస్ ట్రోఫీని ఆవిష్కరించాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చిన తర్వాత నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.

First Published:  11 Jan 2019 4:04 AM GMT
Next Story