మార్చ్ ఒకటిన “118”

గత ఏడాది “MLA” “నా నువ్వే” వంటి సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్…. ఈ ఏడాది “ఎన్టీఆర్ – కథానాయకుడు” లో హరి క్రిష్ణ పాత్రలో నటించాడు.

ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ “118” తో రెడీ గా ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ అయిన కే.వి గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ సరసన శాలిని పాండే , నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 1న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారట నిర్మాతలు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేశ్ ఎస్ కోనేరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ తో బిజీగా ఉంది. పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయిన కళ్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.