కథ సెట్ అవ్వలేదు…. సినిమా వాయిదా

అల్లు అర్జున్, త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ అయితే సెట్ అయింది. అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కానీ కథ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. దీంతో సినిమాను మరో 2 నెలలు వాయిదావేశారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి వీళ్లిద్దరూ కలిసి ఓ రీమేక్ ప్రాజెక్టు అనుకున్నారు. కానీ ఆ రీమేక్ రైట్స్ టీ-సిరీస్ వద్ద ఉన్నాయి. వాళ్లు హక్కులు ఇవ్వడానికి రెడీ అయ్యారు కానీ నిర్మాణ భాగస్వామ్యం కోరారు. అందుకే ఆ కథను వద్దనుకున్నారు. కొత్తగా మరో 2 స్టోరీలైన్స్ అనుకున్నారు. స్టార్టింగ్ లో ఆ రెండూ బన్నీకి నచ్చాయి. కానీ రోజులు గడిచేకొద్దీ అవి రొటీన్ అనిపించాయి. అందుకే ఇప్పుడు మరో కథపై ఇద్దరూ వర్కవుట్ చేస్తున్నారు.

అలా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా మార్చి నెలకు వాయిదాపడింది. మరోవైపు ఈ ప్రాజెక్టులో హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ గా ఎవర్ని తీసుకోవాలనే అంశంపై కూడా త్రివిక్రమ్, బన్నీ మధ్య సయోధ్య కుదరడం లేదు. త్రివిక్రమ్ చెబుతున్న పేర్లు బన్నీకి నచ్చడం లేదు. బన్నీ చెబుతున్న పేర్లను త్రివిక్రమ్ ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో ఏంటో!