జెర్సీ టీజర్ రివ్యూ

నానికి సక్సెస్ తెచ్చిన సినిమాలన్నీ కథాబలం ఉన్నవే. ఎప్పుడైతే మాస్ సినిమాలంటూ ఫార్ములా వెంట పడ్డాడో అప్పట్నుంచి ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. జరిగిన నష్టాన్ని వెంటనే గుర్తించిన నాని, తిరిగి తన మార్క్ కథల్లోకి వెళ్లిపోయాయి. అలా చేస్తున్నదే జెర్సీ సినిమా. ఈరోజు విడుదలైన ఈ సినిమా టీజర్ చూస్తే ఎవరికైనా వింటేజ్ నాని గుర్తొస్తాడు.

36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ అనే క్రికెటర్ ఎలా క్రికెట్ లో రాణించాడనే కాన్సెప్ట్ తో జెర్సీ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. అ

ర్జున్ అనే ఔత్సాహిక క్రికెటర్ పాత్రలో నేచురల్ లుక్ లో (మేకప్ లేకుండా) నాని బాగానే ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ను మరింత ఎమోషనల్ ఫీల్ తీసుకొచ్చింది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాతో శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా పరిచయమౌతుంది. టీజర్ లో ఆమెను మాత్రం చూపించలేదు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.