లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో చంద్రబాబు ఈయనే… గెటప్ చూస్తే అలా అనిపిస్తోందా?

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన రాంగోపాల్ వర్మ… ఇప్పుడు క్యారెక్టర్లను పరిచయం చేస్తున్నారు.

చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రను యజ్ఞశెట్టి పోషిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారో వెల్లడించారు. చంద్రబాబు క్యారెక్టర్ ఫస్ట్‌ లుక్స్‌ను విడుదల చేశారు. చంద్రబాబు పాత్రలో నటుడు శ్రీతేజ్ నటించబోతున్నారు.

వర్మ విడుదల చేసిన చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఫొటోలు అచ్చం ఒరిజినల్ చంద్రబాబు తరహాలోనే ఉన్నాయి. చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఐదు ఫొటోలను వర్మ విడుదల చేశారు. అచ్చం చంద్రబాబు హవభావాలను ఉట్టిపడేలా చూపించారు. అయితే చంద్రబాబు పాత్రకు సంబంధించి వర్మ విడుదల చేసిన ఫొటోలను గమనిస్తే చంద్రబాబును ఈ చిత్రంలో ఒక స్ట్రాంగ్‌ విలన్‌గానే చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది.