బోయపాటి శ్రీను అంటే భయపడుతున్న మహేష్ బాబు అభిమానులు

“వినయ విధేయ రామ”…..ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మాస్ మసాలా కమర్షియల్ సినిమా నెగటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో అసలు కథ లేదు అని అలాగే సినిమాలో యాక్షన్ మితిమీరింది అని ఇలా చాలా కామెంట్స్ ఈ సినిమా పై వస్తున్నాయి. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే బోయపాటి శ్రీను తన తరువాతి సినిమాని నందమూరి బాలక్రిష్ణ తో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే మహేష్ బాబుతో సినిమా తీస్తాడట బోయపాటి శ్రీను.

ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి మహేష్ బాబు అభిమానులు చాలా భయపడుతున్నారట. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు బోయపాటి శ్రీనుతో సినిమా అస్సలు చెయ్యకూడదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబుతో బోయపాటి శ్రీను సినిమా తీస్తే అది ఏ రేంజ్ లో ఫ్లాప్ అవుతుందో అని ఫ్యాన్స్ భయం. అసలు మహేష్ బాబు స్టార్ ఇమేజ్ కి సెట్ అయ్యే కథని బోయపాటి శ్రీను తీసుకురాలేడు అని ఫ్యాన్స్ గట్టి నమ్మకం.