నాగచైతన్య 2 గెటప్పులు

ఈ హీరో సినిమాల్లో పెద్దగా మేకోవర్లు కనిపించవు. ఉన్న లుక్ లోనే చిన్నచిన్న మార్పులు చేసి కనిపిస్తుంటాడు నాగచైతన్య. అందుకే దాదాపు అన్ని సినిమాల్లో ఒకేలా కనిపిస్తాడు ఈ హీరో. కానీ అప్ కమింగ్ మూవీలో మాత్రం ఓ గెటప్ లో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట ఈ అక్కినేని వారసుడు.

ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య లుక్ ఎలా ఉండబోతోందనే విషయం ఫస్ట్ లుక్ తోనే అందరికీ అర్థమైంది. అందులో ఎలాంటి కొత్తదనం లేదు. కానీ మజిలీ సినిమాలో కేవలం అదొక్క లుక్ మాత్రమే కాదు.

అవును…. ఈ సినిమాలో మరో ప్రత్యేకమైన లుక్ కూడా ఉంది. అదేంటనే విషయాన్ని ప్రస్తుతానికి మేకర్స్ రహస్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే ఆ లుక్ తో మరో పోస్టర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

నాగచైతన్య కెరీర్ లో డిఫరెంట్ లుక్ గా అది నిలిచిపోతుందట. సమ్మర్ తర్వాత మజిలీ సినిమా థియేటర్లలోకి రానుంది.