మోడీ ఒక ఎద్దు…. స్మృతి ఒక బలిష్టమైన ఆవు

ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలపై రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత అజిత్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీ, యూపీ సీఎం యోగి, స్మృతి ఇరానీలను జంతువులతో పోల్చారు. వారి మధ్య బంధాన్ని వివాదాస్పద రీతిలో అభివర్ణించారు.

తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకున్నప్పటికీ తిరిగి ఐదేళ్లకు అతడిని మార్చుకునే అవకాశం ఉండడం నిజంగా ప్రజాస్వామ్య గొప్పదనమేనన్నారు. ఈ మధ్య ఆవులు, ఎద్దులు, దూడలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని… వాటిని స్కూల్‌ భవనాల్లో కట్టేస్తున్నారన్నారు.

ప్రజలు ఎద్దులను, దూడలను మోడీ-యోగి అని పిలుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరికొందరు బలిష్టమైన ఆవు కూడా తిరుగుతోందంటున్నారని…. స్మృతి ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎద్దుగా మోడీని, దూడగా యోగిని, బలిష్టమైన ఆవుగా స్మృతిని అభివర్ణించారు అజిత్ సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లో  జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.