ఆ పాత్రకి నో చెప్పడానికి కారణం ఇదేనట!

అక్కినేని సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కొరియన్ సినిమా “మిస్ గ్రానీ” కి ఈ సినిమా రీమేక్ గా తెరక్కుతుంది. ఒక ముసలావిడ ఆత్మ ఒక యవ్వన అమ్మాయిలోకి ప్రవేశిస్తే…. ఆ తరువాత జరిగిన పరిమాణాలు ఏంటి? అనేది కథ.

అయితే ఈ కథలో సమంత యంగ్ రోల్ తో పాటు ముసలావిడ పాత్రని కూడా పోషించాలి. కానీ సమంతా ఇప్పుడు ఆ పాత్రలో నటించను అని నందిని రెడ్డి కి చెప్పిందట. మేక్ అప్ వల్ల తనకు స్కిన్ ప్రాబ్లంస్ వస్తాయని…. అలాగే ముసలావిడ పాత్ర చేస్తే తన మార్కెట్ పడిపోతుంది అనే కారణాలు చెప్పి ఈ పాత్రకి నో చెప్పిందట.

ఇక నందిని రెడ్డి చేసేది లేక ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లక్ష్మిని తీసుకుందట నందిని రెడ్డి. నాగ శౌర్య సమంతా బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, గురు ఫిలింస్ పై సునీత తాటి ఇద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.