“వినయ విధేయ…” మొదటి రోజు వసూళ్లు

రామ్ చరణ్, బోయపాటి ఫ్రెష్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయినా అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

అలా విడుదలైన మొదటి రోజే వినయ విధేయ రామ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పాతిక కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఇక ప్రాంతాల వారీగా రికార్డుల విషయానికొస్తే… సీడెడ్ లో ఈ సినిమా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజు ఈ సినిమాకు సీడెడ్ లో ఏకంగా 7 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు గుంటూరులో కూడా ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఏపీ, నైజాంలో వినయ విధేయ రామ సినిమాకు వచ్చిన మొదటి రోజు షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 5.08 కోట్లు
సీడెడ్ – రూ. 7.15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.45 కోట్లు
ఈస్ట్ – రూ. 2.05 కోట్లు
వెస్ట్ – రూ. 1.83 కోట్లు
గుంటూరు – రూ. 4.17 కోట్లు
కృష్ణా – రూ. 1.45 కోట్లు
నెల్లూరు – రూ. 1.69 కోట్లు