Telugu Global
Cinema & Entertainment

చాలా తక్కువ నిడివితో వస్తున్న "యాత్ర"

తెలుగు లో బయోపిక్స్ హవా నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది “మహానటి” సినిమా ద్వారా సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించి హిట్ అందుకున్నారు మూవీ యూనిట్, ఇక ఇటివలే బాలక్రిష్ణ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర్ర ఆధారంగా “ఎన్టీఆర్” బయోపిక్ ని రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా “యాత్ర” అనే బయోపిక్ కూడా వచ్చేస్తుంది. […]

చాలా తక్కువ నిడివితో వస్తున్న యాత్ర
X

తెలుగు లో బయోపిక్స్ హవా నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది “మహానటి” సినిమా ద్వారా సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించి హిట్ అందుకున్నారు మూవీ యూనిట్, ఇక ఇటివలే బాలక్రిష్ణ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర్ర ఆధారంగా “ఎన్టీఆర్” బయోపిక్ ని రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా “యాత్ర” అనే బయోపిక్ కూడా వచ్చేస్తుంది.

మలయాళ హీరో మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాని మహి వి రాఘవ్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ఎడిటింగ్ వర్క్ ఇటివలే పూర్తయింది. ఎడిట్ టేబుల్ దగ్గర ఈ సినిమా నిడివి కేవలం ఒక గంట యాబై ఏడు నిముషాలు మాత్రమే వచ్చింది అంట. అసలు ఒక బయోపిక్ కి ఇంత తక్కువ నిడివి ఏంటి ఏంటి అందరూ షాక్ అవుతున్నారు. కానీ ఈ బయోపిక్ లో కేవలం రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర గురించే చర్చిస్తున్నారు కాబట్టి తక్కువ నిడివి వస్తుంది అని తెలుస్తుంది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ పై విజయ్ చిల్ల ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ సినిమా ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతుంది.

First Published:  12 Jan 2019 9:04 AM GMT
Next Story