Telugu Global
NEWS

జగన్‌పై దాడి నిందితుడు హైదరాబాద్‌కు

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను నేడు ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకోనుంది. వారం పాటు కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ తీసుకెళ్తున్నారు. విజయవాడలో వైద్యపరీక్షల అనంతరం హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడి ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలోనే శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని పైకోర్టులో సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల […]

జగన్‌పై దాడి నిందితుడు హైదరాబాద్‌కు
X

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను నేడు ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకోనుంది. వారం పాటు కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ తీసుకెళ్తున్నారు.

విజయవాడలో వైద్యపరీక్షల అనంతరం హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడి ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలోనే శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు.

మరోవైపు కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని పైకోర్టులో సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు, సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో ఏవేని ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదన కూడా వినాలంటూ కేవియట్ దాఖలు చేశారు.

First Published:  11 Jan 2019 11:30 PM GMT
Next Story