“అదుర్స్ -2” వచ్చేస్తుంది….

“అదుర్స్”…ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాలో ఛారి అనే పాత్రకి మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో మంచి పాత్రగా నిలిచిపోయింది ఛారి అనే క్యారెక్టర్.

ఇక ఇప్పుడు ఇనేళ్ళ తరువాత ఈ సినిమా సీక్వెల్ చర్చలు జరుగుతున్నాయి. గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో ఎన్టీఆర్, వినాయక్ “అదుర్స్” సినిమాకి సీక్వెల్ కథ బాగా వస్తే కలిసి వర్క్ చేస్తాము అని చెప్పుకొచ్చారు.

ఇక తాజా సమాచారం ప్రకారం కోన వెంకట్ ఇటీవలే “అదుర్స్ 2″ సినిమా కథని పూర్తిగా కంప్లీట్ చేసాడట.”అదుర్స్” కి కూడా కోన వెంకటే కథని అందించాడు. కోన వెంకట్ ఈ విషయం గురించి ట్విట్టర్ లో మాట్లాడుతూ, “అదుర్స్ 2” సినిమా కథ బాగా వచ్చింది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఈ సినిమా చేసే అవకాశం లేదు అన్నట్టు చెప్పుకొచ్చాడు.

కానీ ఈ సారి ఈ సీక్వెల్ ని వినాయక్ డైరెక్ట్ చేస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం డైరెక్టర్ గా వినాయక్ ఫార్మ్ లో లేడు.