అనుష్క సినిమాలో హలీవుడ్ విలన్

స్టార్ హీరోయిన్ అనుష్క తెరపై కనిపించి దాదాపు ఏడాది అవుతోంది. గత ఏడాది “భాగమతి” అనే హారర్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న అనుష్క ఇప్పటి వరకు ఇంకా ఒక్క సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళలేదు.

కానీ ఇటీవలే అనుష్క మహేష్ మధుకర్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ని మార్చి లో మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ యూనిట్. ఈ మేరకు అనుష్క ఇప్పటి నుంచే పాత్ర కోసం కసరత్తులు కూడా స్టార్ట్ చేసిందట.

ఈ పాత్ర కోసం అనుష్క కొంచెం సన్నబడుతోందని సమాచారం.. ఈ సినిమా లో హాలీవుడ్ యాక్టర్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు కోన వెంకట్ కథ అందించి, ప్రొడ్యూస్ చేస్తున్న “సైలెన్స్” అనే సినిమాలో కూడా అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క సరసన మాధవన్ నటిస్తున్నాడు. హేమంత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు.