ఎఫ్2 మూవీ మొదటి రోజు వసూళ్లు

వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 థియేటర్లలో సూపర్ హిట్ అయింది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే ఈ సినిమా బాగుందంటూ రివ్యూలు వచ్చేశాయి. అలా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఎఫ్2 సినిమా, వసూళ్లలో మాత్రం ఆ రేంజ్ చూపించలేకపోయింది. నైజాం మినహా ఏ ప్రాంతంలో ఈ సినిమాకు కోటి రూపాయల షేర్ రాలేదు. దీనికి కారణం థియేటర్లు లేకపోవడమే.

సంక్రాంతి సీజన్ లో చివర్లో విడుదలైంది ఎఫ్2. అప్పటికే థియేటర్లలో బాలకృష్ణ, రజనీకాంత్, రామ్ చరణ్ సినిమాలు తిష్టవేశాయి. దీంతో ఉన్నంతలో ఓ మోస్తరు థియేటర్లలో విడుదలవ్వడం వల్ల ఎఫ్2కు హిట్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

అయితే సినిమాకు హిట్ టాక్ రావడంతో… సంక్రాంతి తర్వాత కూడా నిలబడే సినిమా ఇదే అని తేలిపోయింది. సో.. లాంగ్ రన్ లో ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడం గ్యారెంటీ. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.73 కోట్లు
సీడెడ్ – రూ. 0.52 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.55 కోట్లు
ఈస్ట్ – రూ. 0.63 కోట్లు
వెస్ట్ – రూ. 0.57 కోట్లు
గుంటూరు – రూ. 0.39 కోట్లు
కృష్ణా – రూ. 0.40 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు