Telugu Global
International

ఫేస్ బుక్ అమ్మే యూజ‌ర్ల డేటా ఖ‌రీదు ఎంతంటే..?

ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కంపెనీలకు విక్రయించే ఆలోచనను కొన్నేళ్ళ క్రితమే చేసిందనే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. యూజర్‌ డేటా “ది గ్రాఫ్‌ ఎపిఐ” అందుబాటులోకి వచ్చే సౌలభ్యం కల్పించాలంటే కనీసం 2,50,000 డాలర్లు కంపెనీలు చెల్లించాలని 2012లో ఫేస్‌బుక్‌ సిబ్బంది నిర్ణయించినట్లు స‌మాచారం. అంతేకాదు యూజర్‌ సమాచారం అందే సౌలభ్యాన్ని పెంచితే అందుకు ప్రతిగా మరింత ఖర్చు పెట్టాల్సి వుంటుందన్న ఆలోచనపై ఫేస్‌బుక్‌ ఉద్యోగులు చర్చించారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. అందుకు ఊతంగా ఫేస్ బుక్ […]

ఫేస్ బుక్ అమ్మే యూజ‌ర్ల డేటా ఖ‌రీదు ఎంతంటే..?
X

ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కంపెనీలకు విక్రయించే ఆలోచనను కొన్నేళ్ళ క్రితమే చేసిందనే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. యూజర్‌ డేటా “ది గ్రాఫ్‌ ఎపిఐ” అందుబాటులోకి వచ్చే సౌలభ్యం కల్పించాలంటే కనీసం 2,50,000 డాలర్లు కంపెనీలు చెల్లించాలని 2012లో ఫేస్‌బుక్‌ సిబ్బంది నిర్ణయించినట్లు స‌మాచారం.

అంతేకాదు యూజర్‌ సమాచారం అందే సౌలభ్యాన్ని పెంచితే అందుకు ప్రతిగా మరింత ఖర్చు పెట్టాల్సి వుంటుందన్న ఆలోచనపై ఫేస్‌బుక్‌ ఉద్యోగులు చర్చించారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది.

అందుకు ఊతంగా ఫేస్ బుక్ సంస్థ యూజర్ల లొకేషన్లు కనుగొనడం, వారి సందేశాలను చదవడం, ఫోన్లలో వారి ఫొటోలను అందుబాటులోకి తెచ్చుకోవడం వంటి చర్యలకు పాల్పడిందని గార్డియన్‌ పేర్కొంది.

First Published:  13 Jan 2019 1:32 AM GMT
Next Story