Telugu Global
NEWS

తండ్రి శ్రమ వృథా కాలేదు.... టీ-20లోకి ప్రియా

బయటకు వెళ్లి ఆడుకుంటానంటేనే అభ్యంతరం చెప్పే తల్లిదండ్రులే ఎక్కువ. కానీ ఆ తండ్రి తన కూతురు కోసం ఏకంగా ఆస్తిని అమ్మేశాడు. కూతురు బ్యాట్‌ పట్టి ప్రతిభను చాటుతానంటే తన వంతుగా పెద్ద సాహసమే చేశాడు. ఇప్పుడు ఆ తండ్రి సాహసం వృథా కాలేదు. తన తండ్రిని తలెత్తుకుని తిరిగేలా చేసింది ఆ కూతురు. రాజస్థాన్‌లోని చురూ కు చెందిన ప్రియాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆమె తండ్రి సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగి సురేంద్ర. […]

తండ్రి శ్రమ వృథా కాలేదు.... టీ-20లోకి ప్రియా
X

బయటకు వెళ్లి ఆడుకుంటానంటేనే అభ్యంతరం చెప్పే తల్లిదండ్రులే ఎక్కువ. కానీ ఆ తండ్రి తన కూతురు కోసం ఏకంగా ఆస్తిని అమ్మేశాడు. కూతురు బ్యాట్‌ పట్టి ప్రతిభను చాటుతానంటే తన వంతుగా పెద్ద సాహసమే చేశాడు. ఇప్పుడు ఆ తండ్రి సాహసం వృథా కాలేదు. తన తండ్రిని తలెత్తుకుని తిరిగేలా చేసింది ఆ కూతురు.

రాజస్థాన్‌లోని చురూ కు చెందిన ప్రియాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆమె తండ్రి సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగి సురేంద్ర. తన కూతురు క్రికెట్ ప్రాక్టిస్‌కు వెళ్లిన సమయంలో అక్కడి వారి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సురేంద్ర… 2010లో తన ఆస్తిని అమ్మేసి జైపూర్‌ బయట 22 లక్షల రూపాయలతో అర ఎకరా భూమిని కొన్నాడు.

దాన్ని గ్రౌండ్‌గా మార్చి పిచ్‌, ఇతర ఏర్పాట్లు చేసి కూతురితో ప్రాక్టిస్ చేయించాడు. ఈ గ్రౌండ్‌లోనే కఠోర శ్రమతో నైపుణ్యం సాధించి ప్రియా టీమిండియాలో చోటు సంపాదించింది. 2015లోనే ఆమె దేశవాళి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి చోటు ఆశించారు. కానీ చోటు దక్కలేదు. అయినా సరే మరింత కష్టపడింది.

దేశవాళి మ్యాచ్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ప్రియా పూనియా… గత రెండు సీజన్లలో నిలకడైన ప్రదర్శనతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచారు. వన్డే జట్టులో చోటు వస్తుందని ఆమె భావించారు. కానీ టీ-20కి ఎంపిక చేశారు.

ఈజీగా సిక్సర్లు కొట్టే నైపుణ్యం కూడా ప్రియాకు సొంతం. అందుకే ఆమె దూకుడును చూసి టీ-20కి ఎంపిక చేసి ఉంటారని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన తల్లితండ్రులు, తన దేశ ప్రజలు గర్వించేలా చేస్తానంటోంది ప్రియా.

First Published:  12 Jan 2019 8:30 PM GMT
Next Story