రైల్వే ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫర్…. బెర్త్ ఖాళీగా ఉందా….?

కేంద్ర రైల్వేశాఖ ప్ర‌యాణికులు సౌక‌ర్యార్ధం అనేక మార్పులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే త‌త్కాల్, రిజ‌ర్వేష‌న్ ల‌లో ప‌లు మార్పులు తెచ్చింది. దీంతో ప్ర‌యాణికులు రైల్వే ప్ర‌యాణం వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని మ‌రింత‌గా క్యాష్ చేసుకునేందుకు టికెట్ రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌లో మ‌రిన్ని మార్పులు చేస్తోంది.

ఇందులో భాగంగా బెర్తుల సంఖ్య పెంచ‌డం, క‌దులుతున్న రైల్లో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయి అనే విష‌యాల్ని ఈజీగా తెలుసుకునేందుకు హ్యాండ్ హెల్డ్ ట‌ర్మిన‌ల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంతో వెయిటింగ్ లిస్ట్, ఆర్ ఏసీ టికెట్లు క‌న్ఫామ్ అవుతున్నాయి.

ఈ విధానంలో ప్ర‌యాణికుల వివ‌రాలు, ఎక్క‌డ ఎక్కుతున్నారు… ఎక్క‌డ దిగుతున్నారు… ఒక‌వేళ దిగితే ఏ బెర్త్ లో సీట్ క‌న్ఫామ్ అవుతుంద‌నే విష‌యాన్ని హ్యాండ్ హెల్డ్ టర్మిన‌ల్ ప‌ద్ద‌తి ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఒక‌వేళ ఖాళీగా ఉన్న బెర్త్ ను బుక్ చేసుకుంటే క్లాస్ అప్‌గ్రేడ్, డౌన్‌గ్రేడ్, ఆల్టర్ నేట్ బెర్త్ అలాట్‌మెంట్ చేస్తారు. కాగా రైల్వే ప్ర‌యాణికుల వివ‌రాలు ఆయా రైల్వే స్టేష‌న్ ల‌లో పేప‌ర్ లో పొందుప‌రిచేవారు. కానీ ఇప్పుడు కొత్త డివైజ్ ల‌ను అందుబాటులో తెచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. త‌ద్వారా ఈ – చార్ట్ ల ద్వారా టికెట్ ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.