నెల రోజులు ఆగండి…. మీకే తెలుస్తుంది

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు. బీజేపీ నాయకత్వం ఆదేశిస్తే పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఏపీలో బీజేపీ రోజు రోజుకూ బలపడుతోందన్నారు.

బీజేపీ ఎంతగా బలపడింది అన్నది నెల రోజులు ఆగితే మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్న తనను తిరిగి ప్రజలు ప్రధానిగా ఎన్నుకుంటారన్న నమ్మకం మోడీలో ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు.

ఈ నిర్ణయం తర్వాత ప్రజల్లో మోడీకి మరింత ఆదరణ పెరిగిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని రాష్ట్రంలో కొందరు నటిస్తున్నారని కృష్టంరాజు విమర్శించారు. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్టం రాజు ఒకసారి కాకినాడ నుంచి, మరోసారి నరసాపురం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు.