వినయ విధేయ 2 రోజుల షేర్

ఆల్రెడీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది వినయ విధేయ రామ సినిమా. అయితే అడ్వాన్స్ బుకింగ్స్, సినిమాపై ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు ఈ సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు వచ్చిన విషయం తెలిసిందే.

విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే రిజల్ట్ తేలిపోవడంతో, రెండో రోజు నుంచే ఈ సినిమాకు కలెక్షన్లు పడిపోయాయి. దీనికి తోడు ఎఫ్2 సినిమాకు కొన్ని స్క్రీన్స్ వదులుకోవాల్సి రావడం కూడా వినయ విధేయకు మైనస్ అయింది.

మొత్తమ్మీద ఈ 2 రోజుల్లో వినయ విధేయ రామ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ 2 రోజుల్లో చరణ్ సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 6.79 కోట్లు
సీడెడ్ – రూ. 7.56 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.05 కోట్లు
ఈస్ట్ – రూ. 2.32 కోట్లు
వెస్ట్ – రూ. 2.08 కోట్లు
గుంటూరు – రూ. 4.52 కోట్లు
కృష్ణా – రూ. 1.80 కోట్లు
నెల్లూరు – రూ. 1.85 కోట్లు