మరో ప్రయోగాత్మక పాత్రలో అనుష్క

“సైజ్ జీరో” సినిమా కోసం లావయిన అనుష్క ఇప్పటి వరకు మళ్లీ సన్నగా అవ్వలేదు. ఇక ఇటీవలే యూరప్ లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి కొత్త సినిమా కోసం రెడి అవుతుంది ఈ భామ. 

తాజాగా హేమంత్ మధుకర్ దర్శకత్వం లో ఒక సినిమా కి సైన్ చేసింది. ఇక ఈ సినిమాతో పాటు కోన వెంకట్ స్క్రిప్ట్ తో పాటు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది అనుష్క.

ఇక తాజా సమాచారం ప్రకారం హేమంత్ మధుకర్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా లో అనుష్క బ్లైండ్ అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది అనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. సినిమా మొత్తం అనుష్క గుడ్డి గానే కనిపిస్తుందట.

థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మాధవన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మాధవన్ పాత్ర ఈ సినిమాకే హై లైట్ గా నిలుస్తుందట. ఈ సినిమా లో హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యాడ్సెన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా కోసం అనుష్క సన్నగా అయ్యేందుకు కసరత్తులు ప్రారంభించింది.