ఎఫ్2 మూవీ రెండు రోజుల కలెక్షన్

వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 సినిమా మొదటి రోజు మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లు పెద్దగా లేకపోవడంతో ఈ మూవీ వసూళ్లు కాస్త తక్కువగా అనిపిస్తున్నాయి కానీ, ఈ సంక్రాంతి విన్నర్ ఎఫ్-2 సినిమానే. నిన్నటితో 2 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 14 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఓవర్సీస్ లో ఈ సంక్రాంతికి హిట్ అయిన సినిమా ఇదే. ఇక ఏపీ, నైజాంలో ఎఫ్2 సినిమాకు 2 రోజుల్లో వచ్చిన షేర్ ఇలా ఉంది.
నైజాం – రూ. 3.31 కోట్లు
సీడెడ్ – రూ. 1.06 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.24 కోట్లు
ఈస్ట్ – రూ. 1.01 కోట్లు
వెస్ట్ – రూ. 0.79 కోట్లు
గుంటూరు – రూ. 0.78 కోట్లు
కృష్ణా – రూ. 0.81 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు