Telugu Global
NEWS

వన్డే క్రికెట్లోనూ టీమిండియా పై ఆసీస్ దే పైచేయి

ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో కంగారూ జోరు కంగారూ గడ్డపై 49 వన్డేల్లో 11 విజయాల భారత్ 36 వన్డేల్లో ఆసీస్ గెలుపు, ఫలితం తేలని 2 మ్యాచ్ లు వన్డే క్రికెట్లో రెండోర్యాంకర్ టీమిండియా ప్రత్యర్థిగా …6వ ర్యాంకర్ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 2019 తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేలో సైతం…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు… కంగారూటీమ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. సిరీస్ లో 1-0 తో పైచేయి సాధించింది. కంగారూలదే జోరు…. కంగారూ గడ్డపై వన్డే […]

వన్డే క్రికెట్లోనూ టీమిండియా పై ఆసీస్ దే పైచేయి
X
  • ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో కంగారూ జోరు
  • కంగారూ గడ్డపై 49 వన్డేల్లో 11 విజయాల భారత్
  • 36 వన్డేల్లో ఆసీస్ గెలుపు, ఫలితం తేలని 2 మ్యాచ్ లు

వన్డే క్రికెట్లో రెండోర్యాంకర్ టీమిండియా ప్రత్యర్థిగా …6వ ర్యాంకర్ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 2019 తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేలో సైతం…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు… కంగారూటీమ్ దిమ్మతిరిగే షాకిచ్చింది. సిరీస్ లో 1-0 తో పైచేయి సాధించింది.

కంగారూలదే జోరు….

కంగారూ గడ్డపై వన్డే క్రికెట్లో ….ప్రపంచ రెండో ర్యాంకర్ టీమిండియా పరాజయపరంపర కొనసాగుతూనే ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆసీస్ తో ఆడుతున్న తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేలో సైతం..పవర్ ఫుల్ టీమిండియాకు పరాజయం తప్పలేదు.

వన్డే క్రికెట్లో…అదీ కంగారూ గడ్డపై ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఆడిన సిరీస్ లు, వన్డేల్లో టీమిండియా రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతూనే ఉంది.

టీమిండియా 2- ఆస్ట్రేలియా 6

వన్డే క్రికెట్లో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం…టీమిండియా రెండో ర్యాంకులో ఉంటే…ఆస్ట్రేలియా ఆరో ర్యాంకులో కొనసాగుతోంది. అంతేకాదు..ఆస్ట్రేలియాకు మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన ిరికార్డు ఉంటే.. టీమిండియా రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది.

49 వన్డేలు…11 విజయాలు

ప్రస్తుత 2019 సిరీస్ కు ముందు వరకూ… ఆసీస్ గడ్డపై 48 వన్డేలు ఆడిన టీమిండియా…ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డేతో 49 మ్యాచ్ ల రికార్డు పూర్తి చేసింది.

కంగారూ గడ్డపై ప్రస్తుత సిడ్నీ వన్డేతో కలుపుకొని.. 49 మ్యాచ్ లు ఆడిన టీమిండియాకు…కేవలం 11 విజయాలు మాత్రమే ఉన్నాయి. మరో 36 వన్డేల్లో ఆసీస్ నెగ్గితే… ఫలితం తేలని 2 మ్యాచ్ లు ఉన్నాయి.

ఇక…సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా 17 వన్డేల్లో తలపడిన టీమిండియాకు 2 విజయాలు, 14 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్ రికార్డు మాత్రమే ఉన్నాయి.

129 వన్డేల్లో 45 విజయాలు…

వన్డే క్రికెట్లో…ఓవరాల్ గా ఆసీస్ తో టీమిండియా…మొత్తం 129 వన్డేల్లో ఢీ కొని… 45 విజయాల రికార్డుతో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో 74 పరాజయాలు ఉన్నాయి. ఫలితం తేలని మరో 10 వన్డేల రికార్డు సైతం ఉంది.

తొమ్మిది సిరీస్ ల్లో 4 విజయాలు…

ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకూ…తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్ ల్లో తలపడిన భారత్…4 సిరీస్ ల్లో నెగ్గి…ఐదు సిరీస్ ల్లో పరాజయాలు చవిచూసింది.

దైపాక్షిక సిరీస్ ల్లో భాగంగా …ప్రస్తుత సిడ్నీ వన్డే వరకూ ఈ రెండుజట్లూ 47 వన్డే ల్లో తలపడితే…టీమిండియా 18 గెలుపు, 24 ఓటమి, ఫలితం తేలని 5 వన్డేల రికార్డు ఉంది. 2015-16 ద్వైపాక్షిక సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇదే తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కావడం విశేషం. 2015-16 సిరీస్ లో 4-1తో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది.

ఆస్ట్రేలియా తొలిదెబ్బ…

ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని తొలివన్డే లో సైతం… 34 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా…ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. 1-0తో సిరీస్ లో పైచేయి సాధించింది.

అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా ఈనెల 15న జరిగే రెండో వన్డేలో టీమిండియా నెగ్గితేనే…సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

First Published:  14 Jan 2019 11:16 AM GMT
Next Story