రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సమంతా, నాగ చైతన్య సినిమా

అక్కినేని నాగ చైతన్య, సమంతా లు ఇద్దరూ కలిసి పెళ్లి తరువాత నటిస్తున్న సినిమా “మజిలీ”. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది వరకే “ఏం మాయ చేసావే” “ఆటో నగర్ సూర్య” “మనం” వంటి సినిమాలు వచ్చాయి. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

“నిన్ను కోరి” ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. పూర్తి స్థాయి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో టాకీ పార్ట్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లనుంది. షైన్ స్క్రీన్స్ పై సాహు గోరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

మరి గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద “శైలజా రెడ్డి అల్లుడు” “సవ్యసాచి” వంటి సినిమాలు రిలీజ్ చేసి ప్లాప్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో అయిన హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.