Telugu Global
NEWS

శ్రీనివాస్‌ లాయర్‌కూ చుక్కలు చూపిస్తున్న ఎన్‌ఐఏ

వైఎస్‌ జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌ నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. తొలుత విశాఖలోనే అతడిని విచారించాలనుకున్నారు. కానీ అక్కడ విచారణకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి జగన్‌పై దాడి ఎలా చేశాడో శ్రీనివాస్‌ చేత సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ తీసుకెళ్లారు. శ్రీనివాస్‌ను న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించినా ఎన్‌ఐఏ […]

శ్రీనివాస్‌ లాయర్‌కూ చుక్కలు చూపిస్తున్న ఎన్‌ఐఏ
X

వైఎస్‌ జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌ నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. తొలుత విశాఖలోనే అతడిని విచారించాలనుకున్నారు. కానీ అక్కడ విచారణకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి జగన్‌పై దాడి ఎలా చేశాడో శ్రీనివాస్‌ చేత సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ తీసుకెళ్లారు.

శ్రీనివాస్‌ను న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించినా ఎన్‌ఐఏ స్పీడ్‌ను శ్రీనివాసరావు న్యాయవాది సలీం అందుకోలేకపోతున్నారు. శనివారం తొలుత న్యాయవాది సలీంను హైదరాబాద్‌ రావాల్సిందిగా ఎన్‌ఐఏ అధికారులు కోరారు.

ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత … విశాఖ వెళ్తున్నాం అక్కడికే రండి అని సూచించారు. దాంతో సలీం విజయవాడ నుంచి విశాఖ వెళ్లారు. అక్కడ గంట మాత్రమే న్యాయవాది సమక్షంలో విచారించిన ఎన్‌ఐఏ అధికారులు… తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్నట్టు తెలిపారు. అక్కడికి రావాల్సిందిగా ఆదేశించారు.

అంతే కాదు… తాము నిందితుడు శ్రీనివాస్‌ను ముంబై, చెన్నై, హైదరాబాద్‌ ఇలా ఏ పట్టణానికైనా తీసుకెళ్లి విచారించాల్సిన అవసరం రావచ్చు అని… అందుకు సిద్ధంగా ఉండాలని లాయర్‌కు సూచించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన న్యాయవాది సలీం… ముంబై, చెన్నైకి ఎందుకని ప్రశ్నించారు. అందుకు ఎన్‌ఐఏ అధికారులు ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

దేశంలో ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లి నిందితులను విచారించే అధికారం ఎన్‌ఐఏకు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో శ్రీనివాసరావు న్యాయవాదికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తనను తప్పుదారి పట్టించి… తాను లేని సమయంలో శ్రీనివాసరావును విచారించేందుకు ఎన్‌ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యాయవాది ఆరోపించారు.

First Published:  13 Jan 2019 8:40 PM GMT
Next Story