Telugu Global
NEWS

శివాజీతో పాటు వారినీ ప్రశ్నించనున్న ఎన్ఐఏ ?

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాసరావును విశాఖ తీసుకెళ్లి దాడి ఎలా చేశాడో అతడి చేత సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. పలు కోణాల్లో శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఐఏ త్వరలోనే ఈ కేసులో మరికొందరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. దాడికి కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ గరుడ పేరుతో కథ నడిచింది. కాబట్టి ఈ కేసులో శివాజీని కూడా విచారించే అవకాశం ఉంది. శ్రీనివాసరావు ఒక పాత్రధారి మాత్రమే. […]

శివాజీతో పాటు వారినీ ప్రశ్నించనున్న ఎన్ఐఏ ?
X

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాసరావును విశాఖ తీసుకెళ్లి దాడి ఎలా చేశాడో అతడి చేత సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. పలు కోణాల్లో శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఐఏ త్వరలోనే ఈ కేసులో మరికొందరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

దాడికి కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ గరుడ పేరుతో కథ నడిచింది. కాబట్టి ఈ కేసులో శివాజీని కూడా విచారించే అవకాశం ఉంది. శ్రీనివాసరావు ఒక పాత్రధారి మాత్రమే. ఈ పాత్రధారి వెనుక ఉన్న దర్శక నిర్మాతలు ఎవరో తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ చేసిన దాడికి, ఆపరేషన్ గరుడకు లింక్ ఉంది. దాడి జరిగిన తర్వాత చూపించిన ఫ్లెక్సీ లోనూ గరుడ బొమ్మ ఉంది కాబట్టి…. ఇప్పుడు ముఖ్యంగా నటుడు శివాజీని ఎన్‌ఐఏ ప్రశ్నించవచ్చు.

పైగా ఎయిర్‌పోర్టులోని సీసీ కెమెరాలు సరిగ్గా జగన్‌ పాదయాత్ర విశాఖ జిల్లాలో ఎంటరైన రోజు నుంచే ఆగిపోవడం కీలక పరిణామం. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వెనుక ఏ ఎయిర్‌పోర్టు అధికారుల హస్తముందన్నది నిర్ధారణ కావాల్సిందే.

ముఖ్యంగా నటుడు శివాజీని కేవలం జగన్‌ కేసును దృష్టిలో ఉంచుకునే కాదు. ఆంధ్రప్రదేశ్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని కూడా విచారించాల్సి ఉంటుంది. ఆపరేషన్ గరుడలో భాగంగా ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుంది… ఆతర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని మీడియా ముఖంగా శివాజీ చెప్పారు. కాబట్టి అలా దాడి చేసి అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించిన వారు ఎవరన్నది శివాజీ దగ్గర తప్పకుండా సమాచారం ఉంటుంది.

శ్రీనివాసరావు, నటుడు శివాజీతో పాటు ఎయిర్‌పోర్టు రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ చౌదరి, ఆపరేషన్‌కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎయిర్‌పోర్టు అధికారి వేణుగోపాల్‌ను ఎన్‌ఐఏ విచారించే అవకాశం ఉంది.

First Published:  14 Jan 2019 1:30 AM GMT
Next Story