Telugu Global
National

థియేటర్‌లోనే నర్సుకు ముద్దు పెట్టిన డాక్టర్‌... ఆ తర్వాత...

మధ్యప్రదేశ్‌లో ఒక డాక్టర్‌పై వేటు పడింది. ఆపరేషన్ థియేటర్‌లోనే నర్సుకు ముద్దులు పెడుతూ దొరికిపోయాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో వెంటనే అతడిని విధుల నుంచి తొలగించారు. ఉజ్జయిన్‌ జిల్లా ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న 49 ఏళ్ల డాక్టర్ అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళతో ఆపరేషన్ థియేటర్‌లో చిలిపి పనులు చేశాడు. ముద్దులు పెట్టాడు. ఈ వీడియో బయటకు వచ్చింది. ఆస్పత్రి పరువుకు సంబంధించిన విషయం కావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే డాక్టర్‌ను విధుల […]

థియేటర్‌లోనే నర్సుకు ముద్దు పెట్టిన డాక్టర్‌... ఆ తర్వాత...
X

మధ్యప్రదేశ్‌లో ఒక డాక్టర్‌పై వేటు పడింది. ఆపరేషన్ థియేటర్‌లోనే నర్సుకు ముద్దులు పెడుతూ దొరికిపోయాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో వెంటనే అతడిని విధుల నుంచి తొలగించారు.

ఉజ్జయిన్‌ జిల్లా ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న 49 ఏళ్ల డాక్టర్ అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళతో ఆపరేషన్ థియేటర్‌లో చిలిపి పనులు చేశాడు. ముద్దులు పెట్టాడు. ఈ వీడియో బయటకు వచ్చింది.

ఆస్పత్రి పరువుకు సంబంధించిన విషయం కావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే డాక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. విచారణకు ఆదేశించారు. నర్సుకు ముద్దు పెట్టిన డాక్టర్‌ రెండు రోజులుగా అందుబాటులో లేరు.

49 ఏళ్ల డాక్టర్ … నర్సు అంగీకారంతో ముద్దు పెట్టుకున్నారా… లేక ఆమెను బలవంతం చేశారా? అన్నది విచారణలో తేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సదరు నర్సు వివరాలను వెల్లడించేందుకు ఆస్పత్రి అధికారులు నిరాకరిస్తున్నారు. ఆమె ఇష్టంతోనే డాక్టర్ ముద్దు పెట్టారా లేదా అన్నది తెలియదు కాబట్టి ఆమె వివరాలను బయటకు చెప్పబోమంటున్నారు.

First Published:  13 Jan 2019 9:03 PM GMT
Next Story