Telugu Global
NEWS

నా బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా- షర్మిల

2014 ఎన్నికలకు ముందు నుంచే నటుడు ప్రభాస్‌కు తనకు ఏదో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేశారన్నారు వైఎస్ షర్మిల.  తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హైదరాబాద్ కమిషనర్ ను తన భర్తతో పాటు కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తిరిగి తనపై  తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు ప్రచారానికి చట్ట ప్రకారమే చెక్‌ పెట్టేందుకు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు షర్మిల వెల్లడించారు. ఇది […]

నా బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా- షర్మిల
X

2014 ఎన్నికలకు ముందు నుంచే నటుడు ప్రభాస్‌కు తనకు ఏదో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేశారన్నారు వైఎస్ షర్మిల. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హైదరాబాద్ కమిషనర్ ను తన భర్తతో పాటు కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తిరిగి తనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని షర్మిల వ్యాఖ్యానించారు.

ఈ తప్పుడు ప్రచారానికి చట్ట ప్రకారమే చెక్‌ పెట్టేందుకు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు షర్మిల వెల్లడించారు. ఇది తన ఒక్కదానికే జరిగిన అవమానంగా తాను భావించడం లేదన్నారు. ఇలాంటి రాతలు అనేక మంది మహిళలపై రాస్తున్నారని మండిపడ్డారు. స్త్రీ పట్ల ఇంత శాడిజం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.

ఇలాంటి తప్పుడు విధానాన్ని సమాజం ఆమోదించకూడదన్నారు. మానవహక్కులు, సామానత్వం, మహిళా సాధికారత వంటివి కేవలం మాటలకే పరిమితం కాకూడదన్నారు. ఈ విషయంతో తనకు అండగా ఉండాల్సిందిగా అందరినీ కోరుతున్నానని చెప్పారు.

తాను ఇప్పటికీ మాట్లాడకపోతే తప్పుడు ప్రచారమే నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉందన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా ప్రభాస్ అనే వ్యక్తిని కలవడం గానీ, మాట్లాడడం కానీ చేయలేదన్నారు. ఈ విషయాన్ని తన పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు షర్మిల . తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు కూడా తనలాగే ప్రమాణం చేసి వారు చెబుతున్నది నిజమేమో చెప్పగలరా అని ప్రశ్నించారు.

తన మీద ఆధారపడి కుటుంబం, పిల్లలు ఉన్నారన్నారు. అలాంటి తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఈ పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారని షర్మిల ప్రశ్నించారు. ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నారని నిలదీశారామె. పుకార్లు ప్రచారం చేసే వారి వెనుక ఉన్న వారికి సిగ్గు అనిపించడం లేదా అని మండిపడ్డారు. ఆ ప్రచారం వెనుక టీడీపీ హస్తముందని ఆరోపించారు.

ఒకప్పుడు తన తండ్రిపైనా ఇలాగే ఫ్యాక్షనిస్ట్ అంటూ ప్రచారం చేశారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయనంటే ఏంటో ప్రజలే చూశారన్నారు. మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో వద్దో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు కుటుంబంలో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేదు కాబట్టి తాను ఏపీలో కాకుండా హైదరాబాద్ లో ఫిర్యాదు చేసినట్టు షర్మిల స్పష్టం చేశారు.

First Published:  14 Jan 2019 11:17 AM GMT
Next Story