పాలకొల్లులో బన్నీ హడావుడి… భారీ విరాళం, దత్తతు

హీరో అల్లు అర్జున్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక యూత్‌తో కలిసి హడావుడి చేశాడు. అయ్యప్పస్వామి ఆలయం నుంచి పంచారామం వరకు బైక్‌ ర్యాలీలో బన్నీ పాల్గొన్నాడు.

క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. పాలకొల్లులోని ప్రాథమిక పాఠశాలను దత్తతు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అభిమానులతో కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో బన్నీ పాల్గొన్నాడు. స్థానికంగా ఉన్న అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పాలకొల్లు అంటే తనకు చాలా ఇష్టమని బన్ని చెప్పాడు. తాను కూడా తాతగారి ఊరైన పాలకొల్లులోనే పుట్టానని గుర్తు చేసుకున్నాడు. క్షీరా రామంలో కల్యాణ మండపం నిర్మాణం కోసం బన్నీ రూ. 10 లక్షలు విరాళం ఇచ్చాడు. ఏటా సంక్రాంతి సమయంలో ఊరికి వచ్చి అభివృద్దికి కృషి చేస్తానని బన్నీ చెప్పాడు.