Telugu Global
NEWS

ఉద్యోగమే వదిలేస్తానని ఏపీ పోలీసులకు న్యాయమూర్తి సవాల్

చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే తాను హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు షర్మిల చెప్పిన నేపథ్యంలో ఆమె నిర్ణయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నారని వివరించేందుకు బీజేపీ నేత విల్సన్‌ ఒక విషయాన్ని వెల్లడించారు. ఇటీవల బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం… ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు బాబు- జాబేది అంటూ ధర్నా చేశారు. ధర్నా చేసిన విద్యార్థులను పోలీసులు తీసుకెళ్లి తెల్లవారుజామున ఐదు గంటల వరకు నిర్బంధించారు. ఆ తర్వాత […]

ఉద్యోగమే వదిలేస్తానని ఏపీ పోలీసులకు న్యాయమూర్తి సవాల్
X

చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే తాను హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు షర్మిల చెప్పిన నేపథ్యంలో ఆమె నిర్ణయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నారని వివరించేందుకు బీజేపీ నేత విల్సన్‌ ఒక విషయాన్ని వెల్లడించారు.

ఇటీవల బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం… ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు బాబు- జాబేది అంటూ ధర్నా చేశారు. ధర్నా చేసిన విద్యార్థులను పోలీసులు తీసుకెళ్లి తెల్లవారుజామున ఐదు గంటల వరకు నిర్బంధించారు. ఆ తర్వాత ధర్నా చేసి అరెస్ట్‌ అయిన వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ధర్నాలో అరెస్ట్ అయిన వారిని రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరగా న్యాయమూర్తి నిరాకరించారు.

ఈ సందర్భంగా స్థానిక సీఐ, ఎస్‌ఐలు ముందే తనను కలిసి అరెస్ట్ అయిన వారిని రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారని, అలా చేయడం ద్వారా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు సీఐ, ఎస్‌ఐ ప్రయత్నించారని న్యాయమూర్తి బహిరంగంగా చెప్పారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు అని… అలా ధర్నా చేసిన వారిని రిమాండ్‌కు తరలించేలా తాను ఆదేశాలు ఇవ్వబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తరపున న్యాయవాది తాము పైకోర్టుకు వెళ్తామని చెప్పారు.

దీంతో ఆగ్రహించిన జడ్జి… నిరసన తెలిపినందుకే విద్యార్థులను రిమాండ్‌కు తరలించేలా ఏ న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేయరని… ఒకవేళ ఏ న్యాయమూర్తి అయినా సరే నిరసన తెలిపిన వీరిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇస్తే తాను ఉద్యోగాన్నే వదిలేస్తానని న్యాయమూర్తి సవాల్ చేశారని విల్సన్ వివరించారు. ఏపీలో పోలీసులపై చంద్రబాబు నుంచి ఈ స్థాయిలో ఒత్తిడి ఉంది కాబట్టి షర్మిల హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడంలో తప్పు లేదన్నారు విల్సన్.

First Published:  14 Jan 2019 10:39 PM GMT
Next Story