ఏప్రిల్ 12 న తేజు కెరీర్ ఆధారపడి ఉంది

 ఈ కాలం యువ హీరోల్లో వరుసగా ఆరు ఫ్లాప్స్ ని అందుకొని రికార్డ్ క్రియేట్ చేసాడు మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ప్లాప్ ని భరించలేక కొంత కాలం బ్రేక్ తీసుకున్న ఈ హీరో ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో లో ఒక సినిమా చేస్తున్నాడు. “నేను శైలజ” “ఉన్నది ఒక్కటే జిందగి” వంటి ఎమోషనల్ కథలని హ్యాండిల్ చేసిన కిషోర్ సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించే సినిమాని కూడా మంచి ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కిస్తున్నాడు అంట.

“చిత్రలహరి” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న రిలీజ్ కానుంది. సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఏప్రిల్ 12న తేజు కెరీర్ ని డిసైడ్ చేసే డేట్ కాబోతుంది. ఎందుకంటే ఆ రోజు “చిత్రలహరి” సినిమా రిసల్ట్ బట్టి తేజు తదుపరి సినిమాల విషయం తెలుస్తుంది. కల్యాణి ప్రియదర్శిని, నివేత పుతిరాజ్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.