Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ దిల్ రాజు తోనే అంటున్న అనిల్ రావిపూడి

కొన్నేళ్లుగా ప్లాప్స్ తోనే ఉంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ కి “పటాస్” వంటి సినిమాని ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా సక్సెస్ తరువాత ఇండస్ట్రీ లో అందరి హీరోల కళ్ళు అనిల్ రావిపూడి పైనే పడ్డాయి. ఇక ఆ తరువాత వరుసగా “సుప్రీమ్” “రాజా ది గ్రేట్” వంటి సినిమాలని డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్. ఇప్పటికే అనిల్ రావిపూడి తో రెండు సినిమాలని ప్రొడ్యూస్ చేసిన […]

మళ్ళీ దిల్ రాజు తోనే అంటున్న అనిల్ రావిపూడి
X

కొన్నేళ్లుగా ప్లాప్స్ తోనే ఉంటున్న నందమూరి కళ్యాణ్ రామ్ కి “పటాస్” వంటి సినిమాని ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా సక్సెస్ తరువాత ఇండస్ట్రీ లో అందరి హీరోల కళ్ళు అనిల్ రావిపూడి పైనే పడ్డాయి.

ఇక ఆ తరువాత వరుసగా “సుప్రీమ్” “రాజా ది గ్రేట్” వంటి సినిమాలని డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్. ఇప్పటికే అనిల్ రావిపూడి తో రెండు సినిమాలని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాను కూడా ఆయనే ప్రొడ్యూస్ చేసాడు.

ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అనిల్ రావిపూడి ని దిల్ రాజు మరొక సినిమాకు లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం నాగ చైతన్య “మజిలీ” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి కథని వింటాడట చైతు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉంటాడు. ఇప్పటికే మూడు సూపర్ హిట్ లను అందించిన అనిల్ రావిపూడి నాలుగవసారి కూడా దిల్ రాజు కి హిట్ ను అందిస్తాడో లేదో వేచి చూడాలి.

First Published:  15 Jan 2019 7:16 AM GMT
Next Story