కథానాయకుడి నీ క్రాస్ చేసిన ఎఫ్-2

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా వచ్చి నిన్నటికి 6 రోజులు అవుతుంది. ఎఫ్-2 సినిమా వచ్చి నిన్నటికి 3 రోజులు అవుతుంది. అయినప్పటికీ బాలయ్య సినిమాను వెంకీ-వరుణ్ తేజ్ ల సినిమా క్రాస్ చేసేసింది. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు రెండో రోజు నుంచి వసూళ్లు తగ్గితే, ఎఫ్-2 సినిమాకు రెండో రోజు, మూడో రోజు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఎఫ్-2 సినిమా 15 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ లెక్క 20 కోట్ల పైమాటే. పైగా రేపట్నుంచి ఈ సినిమాకు థియేటర్లు పెంచబోతున్నట్టు స్వయంగా దిల్ రాజు ప్రకటించాడు. సో.. ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే.. ఈ సినిమా లాంగ్ రన్ లో 50 కోట్ల రూపాయల షేర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక ఎఫ్-2 సినిమా ఈ 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్

నైజాం – రూ. 5.10 కోట్లు

సీడెడ్ – రూ. 1.69 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 1.79 కోట్లు

ఈస్ట్ – రూ. 1.61 కోట్లు

వెస్ట్ – రూ. 1.05 కోట్లు

గుంటూరు – రూ. 1.27 కోట్లు

కృష్ణా – రూ. 1.25 కోట్లు

నెల్లూరు – రూ. 0.46 కోట్లు