ఇది తేజ స్క్రిప్ట్ కాదు ౼ క్రిష్

నందమూరి బాలక్రిష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన “ఎన్టీఆర్ ” బయోపిక్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అంతో కొంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చెయ్యడం వల్లే ఈ మాత్రం ఆడియెన్స్ అయిన ఉన్నారు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో ఉంది. అయితే సినిమాకి హైప్ రావడానికి క్రిష్ ఎంతో హెల్ప్ అయ్యాడు కూడా. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం క్రిష్ సొంతగా పూర్తి చేసుకోలేదు అని, గతంలో తేజ దర్శకుడిగా ఉన్నప్పుడు ఉన్న స్క్రిప్ర్ తోనే క్రిష్ ఈ “ఎన్టీఆర్” బయోపిక్ ని డైరెక్ట్ చేసాడు అని చాలా మంది అంటున్నారు. ఎలానో అలా ఈ మాట క్రిష్ చెవిన పడింది.

ఇక క్రిష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ “తేజ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడు అనేది నాకు అస్సలు తెలియదు, అయితే ఈ చిత్ర నిర్మాతలు మాత్రం నా వద్దకు ఒక స్క్రిప్ట్ పట్టుకొని వచ్చారు. నేను ఆ స్క్రిప్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో నుంచి కొన్ని ముఖ్య అంశాలు మాత్రమే తీసుకుని నా స్టైల్ లో నేను మార్పులు చేసుకున్నాను. తేజ కి నా స్క్రిప్ట్ తో ఎలాంటి సంభందం లేదు. ఇలాంటి ఒక గొప్ప సినిమాకి నా పేరు డైరెక్టర్ పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు క్రిష్.