Telugu Global
Cinema & Entertainment

మరోసారి తెరపైకి మర్మకళ

వందల ఏళ్ల కిందట మన దేశంలో ప్రాచుర్యంలో ఉండేదట మర్మకళ. ఈ కళను కొంచెంకొంచెంగా భారతీయుడు సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కళతో శంకర్ కు అవసరం వచ్చింది. అవును.. ఇండియన్-2 సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు ఈ దర్శకుడు. కమల్ హీరోగా ఈనెల 18 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రీ-లుక్ లో భాగంగా మర్మకళకు సంబంధించిన ఫొటోనే విడుదల చేయడం గమనార్హం. భారతీయుడు సినిమాలో ఇద్దరు […]

మరోసారి తెరపైకి మర్మకళ
X

వందల ఏళ్ల కిందట మన దేశంలో ప్రాచుర్యంలో ఉండేదట మర్మకళ. ఈ కళను కొంచెంకొంచెంగా భారతీయుడు సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కళతో శంకర్ కు అవసరం వచ్చింది. అవును.. ఇండియన్-2 సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు ఈ దర్శకుడు. కమల్ హీరోగా ఈనెల 18 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రీ-లుక్ లో భాగంగా మర్మకళకు సంబంధించిన ఫొటోనే విడుదల చేయడం గమనార్హం.

భారతీయుడు సినిమాలో ఇద్దరు కమల్ హాసన్లు ఉంటారు. సేనాపతి అనే తండ్రిపాత్రతో పాటు బోస్ అనే కొడుకు పాత్ర ఉంది. కాకపోతే పార్ట్-1లోనే కొడుకు క్యారెక్టర్ చనిపోతుంది. కాబట్టి పార్ట్-2లో కేవలం సేనాపతి మాత్రమే కనిపిస్తాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. భారతీయుడులో ఊర్మిళ, మనీషా కొయిరాలా నటించారు. ఇండియన్-2లో మాత్రం ఒక్కరే హీరోయిన్.

ఈ సీక్వెల్ లో హీరోయిన్ పాత్ర కోసం కాజల్ ను ఎంపిక చేశారు. 50 ఏళ్ల వృద్ధ మహిళ పాత్ర కోసం కాజల్ ఇందులో మేకోవర్ కూడా అవ్వబోతోంది. ఆమె కెరీర్ లోనే విలక్షణ పాత్ర ఇది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

నిజానికి ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాలి. ఆ విషయాన్ని గతంలో అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ దిల్ రాజు తప్పుకోవడంతో.. లైకా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది.

First Published:  15 Jan 2019 8:03 AM GMT
Next Story