Telugu Global
NEWS

కోడిపందాల్లో విషాదం... 5వేలు పందెం కాసి టెన్షన్‌తో మృతి

కృష్ణా జిల్లాలో జరుగుతున్న కోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కోడి పందాల బరి వద్దే గుండెపోటుతో చనిపోయాడు. కొడవటికల్లు కోడి పందాల బరి వద్ద ఈ ఘటన జరిగింది. నందిగామకు చెందిన భట్టిప్రోలు రవి కోడి పందాలు ఆడేందుకు వచ్చాడు. ఐదు వేల రూపాయలు పందెం కాసాడు. ఇంతలో కోడి పందాలు జరుగుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసే లోపే ప్రాణాలు విడిచాడు. పందెం కాసి గెలుస్తానో […]

కోడిపందాల్లో విషాదం... 5వేలు పందెం కాసి టెన్షన్‌తో మృతి
X

కృష్ణా జిల్లాలో జరుగుతున్న కోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కోడి పందాల బరి వద్దే గుండెపోటుతో చనిపోయాడు.

కొడవటికల్లు కోడి పందాల బరి వద్ద ఈ ఘటన జరిగింది. నందిగామకు చెందిన భట్టిప్రోలు రవి కోడి పందాలు ఆడేందుకు వచ్చాడు. ఐదు వేల రూపాయలు పందెం కాసాడు. ఇంతలో కోడి పందాలు జరుగుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు.

అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసే లోపే ప్రాణాలు విడిచాడు. పందెం కాసి గెలుస్తానో లేదో అన్న టెన్షన్‌తో…. రవి ప్రాణాలు పోయినట్టు భావిస్తున్నారు. రవి మృతితో కొద్ది సేపు ఆగిన కోడి పందాలు… అతడి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించగానే తిరిగి ప్రారంభమయ్యాయి.

First Published:  15 Jan 2019 3:26 AM GMT
Next Story