Telugu Global
Cinema & Entertainment

"వినయ విధేయ రామ" రిజల్ట్ వినాయక్ కు ప్లస్ అయ్యింది

బోయపాటి శ్రీను ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెట్టి తీసిన సినిమా “వినయ విధేయ రామ”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచి కలెక్షన్స్ దగ్గర డీలా పడిపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా బోయపాటి శ్రీను కి లైన్ లో బాలక్రిష్ణ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే “వినయ విధేయ రామ” కి ముందు బాలక్రిష్ణ కేవలం బోయపాటి శ్రీను […]

వినయ విధేయ రామ రిజల్ట్  వినాయక్ కు ప్లస్ అయ్యింది
X

బోయపాటి శ్రీను ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెట్టి తీసిన సినిమా “వినయ విధేయ రామ”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచి కలెక్షన్స్ దగ్గర డీలా పడిపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా బోయపాటి శ్రీను కి లైన్ లో బాలక్రిష్ణ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.

అయితే “వినయ విధేయ రామ” కి ముందు బాలక్రిష్ణ కేవలం బోయపాటి శ్రీను సినిమాకి మాత్రమే ఓకే చెప్పాడు, కానీ ఇప్పుడు వి.వి.వినాయక్ ని కూడా పిలిచి కథ రెడీ చేస్కో సినిమా చేద్దాం అని చెప్పాడట. అంటే ఒకవేళ బోయపాటి శ్రీను సినిమా వర్క్ అవుట్ అవ్వకపోయినా కూడా వినాయక్ సినిమా అవుతుంది అనే నమ్మకం బాలక్రిష్ణ లో ఉంది.

అసలైతే మొదట వినాయక్ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసాడు బాలక్రిష్ణ. కానీ “వినయ విధేయ రామ” రిజల్ట్ చూసాక వినాయక్ కి కబురు పెట్టి సినిమా అవకాశం ఇచ్చాడు అని టాక్. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ రెండూ ఒక్కటేసారి షూటింగ్ కి వెళ్లనున్నాయి.

First Published:  15 Jan 2019 10:32 PM GMT
Next Story