Telugu Global
NEWS

యూట్యూబ్, ఫేస్‌బుక్‌కు సీసీఎస్ పోలీసుల లేఖలు

సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు, కామెంట్స్‌కు సంబంధించిన యూఆర్‌ఎల్‌లపై విచారణ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్‌ వెల్లడించారు. ఇప్పటికే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధ్యులకు సంబంధించిన వివరాల కోసం యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ సంస్థలను […]

యూట్యూబ్, ఫేస్‌బుక్‌కు సీసీఎస్ పోలీసుల లేఖలు
X

సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు, కామెంట్స్‌కు సంబంధించిన యూఆర్‌ఎల్‌లపై విచారణ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్‌ వెల్లడించారు.

ఇప్పటికే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధ్యులకు సంబంధించిన వివరాల కోసం యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ సంస్థలను సంప్రదించినట్టు వివరించారు. వారి నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు.

కొన్ని యూట్యూబ్‌ చానళ్లు, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో మరీ అతిగా అసభ్యకరమైన మెసేజ్‌లు ఉంచారని… వాటిని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వీడియోలు తయారు చేసిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు.

గతంలోనూ ఇలాంటి పోస్టులే పెట్టి ముగ్గురు అరెస్ట్ అయ్యారని… ఇప్పుడు కూడా వారి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు రఘువీర్ వివరించారు. షర్మిలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు, పోస్టులు పెట్టిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

First Published:  16 Jan 2019 3:25 AM GMT
Next Story