Telugu Global
CRIME

హైదరాబాద్‌లో కుక్క దారుణ హత్య... కారణం అదే...

హైదరాబాద్‌లో ఒక వ్యక్తి … ఒక కుక్కను దారుణంగా చంపేశాడు. తాగిన మత్తులో కొడవలి తీసుకుని కుక్కను వెంబడించి మరీ హత్య చేశాడు. పదేపదే కొడవలితో నరకడంతో సదరు కుక్క తీవ్రంగా గాయపడింది. తాగుబోతు కుక్కను వెంటాడి నరుకుతున్న దృశ్యాన్ని చూసి అటుగా వెళ్తున్న దంపతులు అడ్డుకోబోగా వారిని కూడా చంపేస్తానని బెదిరించారు. కుక్కను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన మెడ్చల్‌లో జరిగింది. నిందితుడిపై జంతు సంరక్షణకు సంబంధించిన సంస్థ  పోలీసులకు ఫిర్యాదు […]

హైదరాబాద్‌లో కుక్క దారుణ హత్య... కారణం అదే...
X

హైదరాబాద్‌లో ఒక వ్యక్తి … ఒక కుక్కను దారుణంగా చంపేశాడు. తాగిన మత్తులో కొడవలి తీసుకుని కుక్కను వెంబడించి మరీ హత్య చేశాడు. పదేపదే కొడవలితో నరకడంతో సదరు కుక్క తీవ్రంగా గాయపడింది.

తాగుబోతు కుక్కను వెంటాడి నరుకుతున్న దృశ్యాన్ని చూసి అటుగా వెళ్తున్న దంపతులు అడ్డుకోబోగా వారిని కూడా చంపేస్తానని బెదిరించారు. కుక్కను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన మెడ్చల్‌లో జరిగింది. నిందితుడిపై జంతు సంరక్షణకు సంబంధించిన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాగిన మత్తులో ఉన్న తనను కుక్క కరవడానికి వచ్చిందన్న కోపంతో సదరు వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. గాయపడిన కుక్క తప్పించుకునేందుకు పారిపోతున్నా వదిలిపెట్టలేదు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ప్రేమలతా రెడ్డి దంపతులు కుక్కను రక్షించే ప్రయత్నం చేశారు. దాన్ని అక్కడే ఉన్న ఒక బాత్‌ రూంలోకి పంపించి తలుపు వేశారు.

దాంతో తాగుబోతు… ప్రేమలతారెడ్డి దంపతులనూ చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో స్థానికులు కూడా రావడంతో తాగుబోతు పారిపోయారు. ఆ వెంటనే ప్రేమలతారెడ్డి దంపతులు విషయాన్ని ఎన్‌జీవో ప్రతినిధులకు తెలియజేశారు. వారు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ కుక్క చనిపోయింది.

కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. తన కుక్క హత్యకు గురికావడంతో దాని యజమాని రామశివ తీవ్ర ఆవేదన చెందారు.

First Published:  15 Jan 2019 7:58 PM GMT
Next Story