Telugu Global
Cinema & Entertainment

విజయ్ సేతుపతి అదరగొట్టాడుగా..!

ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ సందర్భంగా సైరా సినిమా నుంచి అతడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్యారెక్టర్ కు ప్రాణం పోయడంలో విజయ్ సేతుపతి నంబర్ వన్ అనే విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. రీసెంట్ గా వచ్చిన పేట సినిమాలో కూడా విజయ్ సేతుపతి అదరగొట్టాడు. సైరా సినిమాలో కూడా విజయ్ మంచి క్యారెక్టర్ పోషించాడు. దాని పేరు రాజ పాండీ. స్వతంత్ర్య పోరాటంలో భాగంగా సంస్థానాల్ని కలుపుకుంటూ […]

విజయ్ సేతుపతి అదరగొట్టాడుగా..!
X

ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ సందర్భంగా సైరా సినిమా నుంచి అతడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్యారెక్టర్ కు ప్రాణం పోయడంలో విజయ్ సేతుపతి నంబర్ వన్ అనే విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. రీసెంట్ గా వచ్చిన పేట సినిమాలో కూడా విజయ్ సేతుపతి అదరగొట్టాడు. సైరా సినిమాలో కూడా విజయ్ మంచి క్యారెక్టర్ పోషించాడు. దాని పేరు రాజ పాండీ.

స్వతంత్ర్య పోరాటంలో భాగంగా సంస్థానాల్ని కలుపుకుంటూ పోరాటం చేస్తుంటాడు సైరా నరసింహారెడ్డి. ఈ క్రమంలో నరసింహారెడ్డి చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతాడు పొరుగునే ఉన్న రాజపాండీ. వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ పాలకులపై సమరశంఖం పూర్తిస్తారు. ఇలా ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి లుక్ తో సైరా సినిమాకు సంబంధించి కీలకమైన ఫస్ట్ లుక్స్ అన్నీ వచ్చేసినట్టే. చిరంజీవితో పాటు అమితాబ్, నయనతార, సుదీప్ కు చెందిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు.

First Published:  16 Jan 2019 7:34 AM GMT
Next Story