Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి వల్లే "వినయ విధేయ రామ" ఫ్లాప్ అయ్యిందా ?

“వినయ విధేయ రామ” సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. పైగా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే చాలా తక్కువ కలెక్షన్స్ ని రాబట్టుకునేలా ఉంది. బోయపాటి శ్రీను తీసిన ఈ మూవీ ఆఖరికి మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు. అయితే అసలు ఇలాంటి స్క్రిప్ట్ ని చరణ్ కోసం చిరంజీవి ఎలా ఓకే చేసాడు అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఇండస్ట్రీ సైడ్ […]

చిరంజీవి వల్లే వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యిందా ?
X

“వినయ విధేయ రామ” సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. పైగా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే చాలా తక్కువ కలెక్షన్స్ ని రాబట్టుకునేలా ఉంది. బోయపాటి శ్రీను తీసిన ఈ మూవీ ఆఖరికి మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు.

అయితే అసలు ఇలాంటి స్క్రిప్ట్ ని చరణ్ కోసం చిరంజీవి ఎలా ఓకే చేసాడు అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఇండస్ట్రీ సైడ్ నుంచేమో అసలు చిరంజీవి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే సినిమా ఇలా ఫ్లాప్ అయ్యింది అని అంటున్నారు.

ఏదేమైనా గాని ఇక్కడ రిజల్ట్ విషయం లో డైరెక్టర్ ది ఎంత తప్పుందో హీరో ది కూడా అంతే తప్పుంటుంది. ఒకవేళ చిరంజీవి గాని బోయపాటి శ్రీను తో ఇంకొన్ని రోజులు కూర్చొని ఉంటే మంచి కథ దొరికేది అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇక ఈ సినిమా రిజల్ట్ బట్టి చూస్తుంటే మెగాస్టార్ ఇకమీదట చరణ్ సినిమాల విషయంలో వేలు పెట్టడని అంటున్నారు.

First Published:  15 Jan 2019 11:01 PM GMT
Next Story