షర్మిలను నేను వ్యక్తిగతంగా అనలేదు….

తెలంగాణ నుంచి వచ్చి చంద్రబాబుపై బురద జల్లేందుకు కేసీఆర్‌ సిద్దంగా ఉన్నారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంతమంది కలిసి వచ్చినా టీడీపీని ఏమీ చేయలేరన్నారు. టీఆర్‌ఎస్‌- వైసీపీ మధ్య దోస్తి ఉన్న విషయం తమకు ముందే తెలుసన్నారు.

టీడీపీపై బీసీలు ఆగ్రహంగా ఉన్నారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కేసీఆర్‌ వచ్చి ఎంత బురద జల్లినా పక్కనే ఉన్న కృష్ణానదిలోకి వెళ్లి కడుక్కుంటామని జేసీ వ్యాఖ్యానించారు. వైఎస్‌ షర్మిల తన కుమార్తెలాంటిందని… ఆమెను తాను ఎన్నడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.

ఒకవేళ అలా విమర్శించి ఉంటే తనకే పాపం తగులుతుందన్నారు. వైఎస్‌ కుటుంబం కులాలను రెచ్చగొడుతోందన్న అంశంపై మాట్లాడుతూ వైఎస్ షర్మిల కులాంతర వివాహాన్ని ప్రస్తావించానని జేసీ వివరణ ఇచ్చారు. కులాంతర వివాహాలు చేసుకున్న వైఎస్‌ కుటుంబాన్ని గతంలో తాను అభినందించానని జేసీ చెప్పారు.