కేసీఆర్‌ వస్తే 160సీట్లు గెలుస్తాం…

మోడీ, కేసీఆర్‌, జగన్‌ ముగ్గురూ ఒకటేనన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. జగన్‌కు అధికారం కలలో కూడా దక్కదన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జగన్‌, టీఆర్‌ఎస్ కలుస్తున్నాయని ఆరోపించారు.

కేసీఆర్‌ ఏపీకి రాకుంటే టీడీపీకి 130 సీట్లు వస్తాయని.. ఒకవేళ కేసీఆర్‌ వస్తే టీడీపీకి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పట్ల దేశం మొత్తం మీద అసహ్యమైన భావన ఉందన్నారు.

ఏపీలో వైసీపీకి 30-40 సీట్లకు మించి రావన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిచినట్టుగానే ఏపీలోనూ టీడీపీ గెలుస్తుందన్నారు.

కేంద్రంలో బీజేపీ అనుకూల, వ్యతిరేక కూటములు మాత్రమే నిలబడుతాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ అనేది బీజేపీ కోసం ఏర్పాటు అయినదేనన్నారు. జగన్‌ను ఏపీ ప్రజలు నమ్మడం లేదన్నారు.