జగన్‌తో భేటీపై కేటీఆర్‌ ట్వీట్

ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు నేడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ …. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్నారు.

ఈ భేటీపై ట్వీట్టర్‌లో కేటీఆర్‌ స్పందించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వైఎస్‌ జగన్‌ను కలుస్తున్నట్టు వివరించారు. మధ్నాహ్నం 12.30కి జగన్‌ను కలుస్తున్నట్టు చెప్పారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ను బలోపేతం చేయడంపై చర్చిస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌… ఎన్‌డీఏకి, యూపీఏకి ప్రత్యామ్నాయమని కేటీఆర్ చెప్పారు.