నాని సరసన మేఘా ఆకాష్  

నాని ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజిగా  ఉన్నాడు. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని అధికారికంగా ప్రకటించాడు నాని. ఈ సినిమాలో నాని ఆరుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు అని టాక్.

అయితే అందులో మెయిన్ హీరోయిన్ గా మాత్రం మేఘా ఆకాష్ ని తీసుకోవాలి అని విక్రం కే కుమార్ అనుకుంటున్నాడట. మెగా ఆకాష్ ఇది వరకు నితిన్ హీరోగా వచ్చిన “లై” “చల్ మోహన్ రంగ” సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవలే ఈ భామ రజనీకాంత్ హీరోగా వచ్చిన “పేట” సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించింది.

ఇలాంటి సమయంలో మేఘా ఆకాష్ కి తెలుగు లో ఇది మంచి ఆఫర్ అనే చేపోచ్చు. విక్రం కే కుమార్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.