“ఎన్టీఆర్” పార్ట్ 2 వాయిదా?

“ఎన్టీఆర్” పార్ట్ -1 ”కథానాయకుడు” ఇటీవలే రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండవ పార్ట్ “మహానాయకుడు” షూటింగ్ జరుగుతోంది.

అయితే ఈ సినిమాని మొదట జనవరి 26 న రిలీజ్ చేద్దాం అనుకున్నారు…. కానీ ఈ సినిమాని ఫిబ్రవరి 7 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. ఇక ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఎందుకంటే రెండోభాగం షూట్ ఇంకా పదిరోజులకు పైగా పెండింగ్ లో ఉంది. అంతే కాక సినిమాకు సంబంధించిన ఇతర వ్యవహారాలు చాలానే ఉన్నాయి. మొన్న నాలుగు రోజులు షూటింగ్ చేసిన చిత్ర బృందం మళ్లీ రేపటి నుంచి ఆఖరి షెడ్యూల్ మొదలుపెట్టబోతుంది.

మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. నెలాఖరు కల్లా షూట్ పూర్తి చేసి, వారం రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలి. అయిదో తేదీ కల్లా ఫైనల్ కాపీ సిద్దంగా వుండాలి. ఇవన్నీ 20 రోజుల్లో పూర్తవ్వాలి అంటే మాములు విషయం కాదు.

అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ బాలక్రిష్ణ మాత్రం సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 7 న రిలీజ్ అవ్వాల్సిందే అని భావిస్తున్నాడట. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ పనుల్లో బిజీ అయిపోతానని చెబుతున్నాడట.